Tuesday, February 8, 2011

The Specialization Of Hindu Temples:హిందూ దేవాలయాల ప్రత్యేకత


దేహానాం ప్రాక్తో దేవాలయహః
ప్రాచీన కాలం నుంచి హిందూ మతంలో దేవాలయాలకు విశిష్ఠమైన స్థానం కలదు. ఎంతో చరిత్ర కలిగి, మరెంతో ప్రాశస్త్యమైన దేవాలయాలు నేడు రాజకీయాల వల్ల, నాయకుల ద్వంద్వ వైఖరుల వల్ల తమ ప్రాభవాన్ని కొల్పోతున్నాయి.హిందూ సమాజానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపునిచ్చిన దేవాలయాలు ఆ జాతికి ఒక దిశానిర్దేశాన్ని చేసాయి.
. హిందువుల ఆరాధన నిమిత్తం రకరకాల పేర్లతో శివాలయాలు, విష్ణు ఆలయాలు తప్పవు. మొత్తంపై ఏదో ఒక పవిత్ర స్థలం అంటూ లేని గ్రామం, పట్టణం ఉండదు. గ్రామాలలో శివ, విష్ణు ఆలయాలు కాక, గంగానమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ మొదలైన దేవతల ఆలయాలు కూడా వెలుస్తాయి. హిందూ దేవాలయాలకు సంబంధించినంతవరకు వాటి నిర్మాణం ఎంత ప్రాచీనమైనదనే విషయం మనకు తెలియదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వేదకాలంలో విగ్రహారాధన లేదు. విగ్రహారాధన సంప్రదాయం ఉంటే తప్ప దేవాలయాల ఆవశ్యకతలేదు. కనుక వేదయుగం తర్వాతనే ఎప్పుడో దేవాలయ నిర్మాణం ప్రారంభమై ఉంటుందని స్థూలంగా చెప్పవచ్చు. యజ్ఞయాగాదులలో నిర్మించే వేదికలే ఆ తర్వాతి కాలపు ఆలయ నిర్మాణానికి ఒరవడి దిద్దాయని కొందరు అంటారు. . హిందూమతంలో నిర్గుణోపాసన, సగుణోపాసన రెండూ ఉన్నాయి. సగుణోపాసన అంటే సాకారుడైన భగవంతుని ధ్యానించి, పూజించి, ఆరాధించడం. ఈ ఆరాధన కోసం విగ్రహం అవసరమైంది. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం అవసరమైంది. దేవాలయ నిర్మాణ శిల్పం భారతదేశంలో పరాకాష్టను చేరింది. అందులోను ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలో ఆలయ వాస్తు....అత్యద్భుతమైన శిల్ప నైపుణ్యంతో అలరారింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆలయ నిర్మాణ నైపుణ్యంలో ఏ ప్రాంతానికి తీసిపోలేదు. మొత్తం దేశంలోనే మొట్ట మొదటి శిలా నిర్మిత దేవాలయంగా గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వరాలయాన్ని .....చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాల ప్రభావం వల్లనో, వివిధ కాలాలలో దండయాత్రల వల్లనో శిథిలమై పోయినవి పోగా, ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన ప్రసిద్ధ దేవాలయాలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి. వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, వేములవాడ, కాళేశ్వరం, దాక్షారామం, మహానంది, అమరావతి మొదలైన చోట్ల గల శైవాలయాలు, తిరుమల, భద్రాచలం, సింహాచలం, యాదగిరి, మంగళగిరి, ర్యాలి, అన్నవరం ,మహబూబ్ నగర్ జిల్లాలోని సింగోటం లోని లక్శ్మీనరసింహాలయం ...మొదలైన చోట్ల గల వైష్ణవాలయాలు ప్రసిద్ధమైనవి. కాగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరాలయం, శ్రీశైలంలోని భ్రమరాంబా మల్లిఖార్జునాలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, భద్రాది రామాలయం, బెజవాడ కనకదుర్గాలయం వంటివి యావద్భారత ప్రశస్తి పొందాయి. హిందూ దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అవి కేవలం ఆరాధనాలయాలు మాత్రమే కాదు. మొత్తం హైందవ సంస్కృతికే నిలయాలు. ముఖ్యంగా గ్రామాలలో అవి ప్రజల సాంఘిక, సాంస్కృతిక, బహుళార్థ సాధక కేంద్రాలు. ప్రజా జీవితంలో వాటిది ప్రముఖ పాత్ర. పూర్వకాలంలో రాజులు, జమీందార్లు దేవాలయాలు నిర్మించేవారు. వాటి నిర్వహణకు, అర్చకుల పోషణకు విరాళాలు, మడిమాన్యాలు, అగ్రహారాలు దానం చేసేవారు. పండుగలకు, పబ్బాలకు, ఉత్సవాలకు దేవాలయాల ప్రాముఖ్యం మరింతగా పెరిగేది. అసలు దేవాలయ నిర్మాణమే గొప్ప శిల్పకళా నైపుణ్యంతో కూడి ఉండేది. అదికాక ఉత్సవాది వివిధ సమయాలలో అక్కడ నృత్య, నాటక, యక్షగాన ప్రదర్శనలు, సంగీత సభలు, పురాణ పఠనాలు, హరికథా శ్రవణాలు జరిగేవి. వాటితో పాటు సంతలు, తిరుణాళ్ళు జరిగేవి. సాధారణ సమయాలలో దేవాలయ ప్రాంగణాలలో పాఠశాలలు, ముఖ్యంగా వేదపాఠశాలలు నడిపేవారు. వైద్యశాలలుగా కూడా ఆ ప్రాంగణాలు ఉపయోగపడేవి. దేవాలయాలున్న ప్రాంతాలను పుణ్యక్షేత్రాలంటారు. ఆసేతు శీతాచలం విస్తరించిన విశాల భూఖండంలోగల అనేక పుణ్యక్షేత్రాలను దర్శించడానికి పూర్వకాలంలో కాలినడకన, గుర్రపు బళ్ళపైన, ఎడ్ల బళ్ళపైన ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు ఆధునిక వాహన సదుపాయాలు వచ్చాయి. భారతదేశం విభిన్న భాషలతో కూడినదైనా భిన్నత్వంలో ఏకత్వం అనే భావన పెంపొందడానికి హిందూమతం, దాని బాహిర రూపాలైన పుణ్యక్షేత్రాలు దోహదం చేశాయి. దేవాలయాలను, ముఖ్యంగా ప్రసిద్ధ దేవాలయాలను సాధారణంగా నదీ తీరాలోను, సముద్రతీరంలోను నిర్మించడం ఒక ఆనవాయితీ. అలా వెలసిన వాటిని పుణ్యతీర్థాలనేవారు. అయితే, అనేక ప్రఖ్యాత దేవాలయాలు పర్వత శిఖరాగ్రాలపైన, లేదా పర్వత సానువులపైన కూడా నిర్మించడం జరిగింది. నదీతీరాలలో ఉన్నా కొండలపై కట్టినా , సాధారణంగా ప్రతి దేవాలయానికి యాత్రికుల స్నాన సౌకర్యాల నిమిత్తం జలాశయం విధిగా ఉండేది. నదులు, సముద్రం ఉంటే సరే. లేకపోతే పుష్కరిణి పేరుతోనో, కొలను పేరుతోనో జల సదుపాయం ఉండవలసిందే . దేవాలయానికి హృదయం వంటిది గర్భగుడి. దానికి ప్రత్యేక ద్వారం తప్ప మరొక ద్వారంగాని, గవాక్షంగాని ఉండదు. తైల దీపాల వెల్తురులోనే దేవుడిని దర్శించాలి. అందుచేతనే గర్భగుడి చీ
Add Imageకటిని చీలుస్తూ నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుంది. గర్భ గుడి పైన గోపురం, లేదా విమానం ఉంటుంది. దానిపై కలశం. గర్భగుడి ముందు ముఖ మండపం, దాని ముందు మహా మండపం, దానిముందు ధ్వజ స్తంభం, శివాలయమైతే నంది విగ్రహం, విష్ణు ఆలయమైతే గరుడ విగ్రహం తప్పవు. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేయడానికి ఖాళీ స్థలం ఉంటుంది. మొత్తం దేవాలయానికి రక్షణగా ఎత్తయిన ప్రాకార కుడ్యాలుంటాయి. ఆవరణలో వివిధ దేవతామూర్తులతో కూడిన చిన్న చిన్న మందిరాలు మండపాలు ఉంటాయి. ప్రధాన ద్వారంపైన చాలా దూరం కనిపించే కొన్ని అంతస్థుల గోపురం కూడా తప్పనిసరి. గర్భగుడిలోని మూలవిరాట్టు కంటె మండపాలలోను, గోపురాల మీదను, స్తంభాలపైన, మందిర కుడ్యాలపైన హిందూ శిల్పుల కళా వైదగ్ధ్యాన్ని వెల్లడిచేస్తూ అద్భుత శిల్పాలు సాక్షాత్కరిస్తాయి. నల్లటి బండరాళ్ళ నుంచి అంతటి సజీవ మూర్తులను ఎలా సృష్టించారా ఆనాటి శిల్పులు అని ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా యక్షిణులు, అప్సరసలు మొదలైన స్త్రీమూర్తుల నృత్య భంగిమాన్విత లాలిత్యం ఈనాటికీ చూపరులను ముగ్దులను చేస్తుంది. ఈ విషయంలో కాకతీయుల కాలం నాటి తెలుగు శిల్పుల ప్రతిభ మొత్తం దేశంలోనే ఏ ప్రాంతపు శిల్ప నైపుణ్యానికి తీసిపోనిది. ఇవికాక, చాలా దేవాలయాలలో బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు జరపడం ఒక ఆనవాయితి. కొన్ని దేవాలయాలకు బ్రహ్మండమైన రథాలుంటాయి. వాటిలో కూడా శిల్పకళా నైపుణ్యం గోచరిస్తుంది. గ్రామాలలో అయితే ఎడ్లు పూన్చిన బండ్లపై శివరాత్రి, విజయదశమి మొదలైన పండుగలకు ఉన్నంతలో వైభవంగానే ఊరేగింపులు జరుగుతాయి. తెలుగువారి సాంఘిక సాంస్కృతిక జీవితంలో దేవాలయాలకు విశేష ప్రాధాన్యం ఉంది..నేడు హిందూ దేవాలయాలు రాజకీయనాయకుల కబంధహస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి.....ఆ బంధ విముక్తి జరిగి పూర్వవైభవం రావాలనీ మనః పూర్వకంగా ఆకాంక్షిస్తూ......
మీ...తూర్పింటి

Monday, February 7, 2011

Dragging of Rock Competation in SINGOTAM:సింగోటంలో బండలాగుడు పోటీలు


సింగోటంలో బండలాగుడు పోటీలు ప్రతీ సంవత్సరం సంక్రాంతి తర్వాత జరుగుతాయి.వేలాది ప్రజల ఆనందోత్సహాల మధ్య ఈ ఏడాది పోటీలు జరిగాయి. తూర్పింటి

సింగోటంలో బండలాగుడు పోటీలు
సింగోటం గ్రామంలో ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా బండలాగుడు పోటీలు
లక్శ్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల తదనంతరం జరిగాయి. ఊళ్ళోని సంతబజారుకు
అభిముఖంగా ఉన్న పొలాళ్లో "ఈ పోటీలుచూపరులకు నయనానందంతో పాటు దుస్తులకు
కాసింత దుమ్మును "ఉచితంగా అందించాయి.
ఈ పోటీల్లో రెండు ఎద్దుల జంట విభాగంలో మొదటి బహుమతిని ...
1517 అడుగుల 10 ఇంచుల దూరం లాగిన వనపర్తి ,జంగిడి రాజు ఎద్దుల జంట కైవసం చేసుకున్నాయి.
వీరికి ఒక తులం బంగారం ను సింగోటం గ్రామ సర్పంచ్ ఎల్లపోగుల వెంకటస్వామి
చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.
ఇహ రెండవ బహుమతిని 1232అడుగుల 10 ఇంచులు లాగిన దావాజిపల్లి ,ప్రవీణ్ రెడ్డి
ఎద్దుల జంట కైవసం చేసుకున్నాయి.వీరికి అర తులం బంగారం ను కార్యక్రమం
తదనంతరం గ్రామ సచివాలయం లో ఇవ్వడం జరిగింది.
3
వ బహుమతిని సింగిల్ విభాగంలో (వ్యక్తిగత విభాగంలో)బి.బాలయ్య , కోడేర్ ఎద్దు 80 అడుగుల 10 ఇంచులు లాగి
10
తులాల వెండిని గెలుపొందింది.
ఈ కార్యక్రమంలో ............................
ఎం.పి.పి శ్రీ జి.నరేందర్ రెడ్డి ,
గ్రామసర్పంచ్ శ్రీ ఇ.వెంకటస్వామి,ఉప సర్పంచ్ శ్రీ సిలోన్ ,శ్రీ బుచ్చిబాబు ,ఎం.పి.టి.సి శ్రీ పాండు, గ్రామ కాంగ్రేస్ యువ నాయకులు శ్రీ కె.వీరయ్యశెట్టి , గ్రామ నాయకులుశ్రీ గణాచారి,
వార్డ్ మెంబర్ శ్రీ జి.నరసింహా,శ్రీ పి.వెంకటస్వామి,గ్రామ యువకులు ,వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన ప్రజలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.
సేకరణ
: తూర్పింటి నరేశ్ కుమార్

Tuesday, February 1, 2011

SINGOTAM BRAHMOSTAVALU:సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు


సింగోటంలో మకర సంక్రాతి తర్వాత ప్రతి ఏడాది 17 వ తేదీన రథోత్సవం జరుగుతుంది.ఈ ఏడాది మాత్రం జనవరి 18 న రథోత్సవం (తేరు) జరిగింది.---తూర్పింటి.నరేశ్ కుమార్

సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
జిల్లాలోనే అతి ప్రాచీనమైన ఆల యాల్లో సింగోటం శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామికి విశిష్టత సంత రించుకుంది. కొల్లాపూర్‌కు 10కి.మీ దూరంలో ఉన్న సింగో ట శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయంలో స్వామివారు వెలి శారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ తాలుకా సింగోటం లో పెద్ద ఎత్తున జరిగే స్వామివారి ఉత్సవాలు సింగోటం జా తరగా పేరొందింది .
మకర సంక్రాంతి సందర్భంగా ప్రారం భమయ్యే శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఉత్సవాలకు మహబూ బ్‌ నగర్‌ జిల్లా నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు.కర్నూల్‌, ఆత్మకూర్‌, నందికోట్కూర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, పాలమూరు, దేవరకొండ, అచ్చంపేట, గద్వాల, తాండూరు, సికింద్రాబాద్‌, తదితర ప్రాంతాల నుంచేకాక పొరుగునున్న కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి జరిగే ఈ జాతరలో ప్రజలకు కావలసిన వంట పాత్రలు బంజార కుటుంబాలకు కావలసిన ఆభరణా లు బట్టలు ఈ జాతర లో దొరుకుతాయి.

అందుకోసం పేద, ధనిక, భేదం లేకుండ అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవాలల్లో పాల్గొని వారికి కావలసిన వస్తువులను కొను గోలు చేసుకోవడం తమ మొక్కుబడులు తీర్చుకోవడం స్వామివారికి తలనీలాలు అర్పించడం వంటివి చేస్తారు. ప్ర క్కనే ఉన్న శ్రీవారి సముద్రం చెరువు నీటితో కళకళ లాడు తుండడంతో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామికి అభిముఖంగా రత్నగిరి కొండపై
శ్రీలక్ష్మిదేవి కొలువై , ఆ దేవతే చెంచులక్ష్మిగా అవతరించింది. ఇక్కడి స్వామి వారికి నిత్యం అభిషేకం పూజా కైంకర్యాలు జరుగుతాయి.అయితే ఇక్కడ ప్రతిష్టించిన శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామికి ఒక ఆకారమంటూ లేదు. లింగాకారం లోనే భక్తుల కు దర్శనమిస్తుంటారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఈసారికొత్తగా గోపురం నిర్మించి అందులో స్వామి పాదాలను ప్రతిష్టించడం విశేషం. ‘స్వామివారి ఇతిహాసం’ శ్రీలక్ష్మిన ర్సింహ్మ స్వామి ఈ ప్రాంతంలో వెలియడంవెనుక ఆసక్తికరమైన ఇతిహాసం వుందని తలపండిన పెద్దలు, సంస్థానంలో కొలువుచేసిన పూర్వీకులు చెబుతారు. 500 ఏళ్ళ క్రితం సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనా యుడనే భూపాలుడు జటప్రోల్‌ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించేవాడు ఓ తన పొలంలో ఒక మూలన అరుక దున్నుతుండగా లింగరూపంలో గల శిలనాగలి కర్రుకు అడ్డుతలిగింది.

పలుమార్లు తన నాగలికి అడ్డుతగులుతున్న శిలను ఆ రైతు ఎన్నిసార్లు ఒడ్డుమీదకు చేరినా తిరిగి అక్కడే ప్రత్యక్షమై అతని పనికి అంతరాయం కలిగిస్తుండేది. అమాయకుడైన ఆ రైతు అడ్డు తగులుతున్న శిలమహిమను గుర్తించలేక దేవుడిని ప్రార్థిస్తూ తనను కరుణించమని పేదవాడినూన తనను ఏ శక్తి వేధించకుండా చూడమని ప్రా ర్థించాడు. ఒక రాత్రి భూపాలుడైన సింగమనాయుని కలలో శిలరూపంలో ఉన్న దేవుడు కనిపించి తాను ఈ ప్రాంతానికి ఉత్తరదిశలో పొలంలో లింగరూపంలో వెలిశానని చె ప్పాడు. తాను రోజు నాగలికి అడ్డుతగులుతున్న అతను నన్ను నర్సింహ్మస్వామిగా గుర్తించడం లేదని చెబుతాడు, ఇదే దినం నడిజాములో తనను గుర్తించి వెంటనే ప్రతిష్టించి పూ జలు జరపాలని చెబుతాడు.సింగమనాయుడు తాను కల కన్నది నిజమా....? అని తెలుసుకునేందుకు సైన్యంతో పొలా న్ని కాగడాల సహాయంతో వెతుకుగా లింగరూపంలో వెలిగిపోతున్న శిల సరిగా ఉండ డంతో అప్పటికప్పుడు భూ పాలుడు ఆ లింగాన్ని అభిషేకించి ప్రతిష్టించారని ప్రచారంలో ఉన్న కథనం. స్వామికి ఎండ తగలకుండ నాపరాయి, మట్టితో చిన్న గుడిని నిర్మించారు. ఆ గుడి నేటికి ప్రస్తుతం ఉన్న శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామి ఆలయంలో వున్న.... గర్భాలయం భక్తులకు దర్శనమిస్తుంది. లింగాకారంలో శిలా విగ్రహమే ప్రజలకు నిత్యం దర్శన మి స్తున్న స్వామియే శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి

15 నుండి ఉత్సవాలు ప్రారంభం
ఈ నెల 15 నుండి 20 వరకు శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఉ త్సవాలు జరుగుతాయని
పురోహితుడు ఓరుగంటి సతీశ్ కుమార్ 9704321252తెలిపారు
15 వ తేది బ్రహ్మోత్సవాలు అభిషేకం
16 వ తేది శకటోత్సవం , పల్లకీ సేవ ,లక్ష్మినర్సింహ్మస్వామికల్యాణోత్సవం
17 సింహవాహన సేవ , లక్ష్మీ గణపతీ హోమం
18 స్వామివారి రథోత్సవం (తేరు)
19 రత్న లక్స్శ్మీ అమ్మవారి అభిషేకం ,సహస్ర నామ పారాయణం ,తెప్పోత్సవం
20 తీర్హావళి , బలి హరణం , డోలోత్సవం , చప్పురపు సేవ

మరింత సమాచారం కోసం చూడండి...
http://singotam.blogspot.com
http://www.etelangana.org/telangana_books.asp

--------తూర్పింటి నరేశ్ కుమార్

TOTAL INFORMATION OF SINGOTAM


TOTAL AREA .... 839 HECTORS (8.39Sq Km.)
POPULATION ......3O48
HOUSES ....692
PRIMARY HEALTH CENTERS ----- 01
VETARNARY CENTERS ----- 01
MOBILE HEALTH CENTERS ----- 00
MEDICAL SHOPS .......02
POST OFFICES ------ 01
VILLAGE PIN CODE ------509102

SELF HELP GROUPS(SHG) 36
RATION SHOPS 02
ANGANWADI CENTERS 05
ASH WORKERS 05
COMMUNITY CENTERS 01
SPORTS FIELD 01

FOREST AREA NIL
NON AGRICULTURAL LAND (USES) 36 HECTORS
UN-CULTIVATED LAND 178 HECTORS
CULTIVATABLE WAST LAND 40 HECTORS
FALLOW-LAND(vagulu n vankalu) 30 HECTORS
CURRENT FALLOE LAND 40 HECTORS

NET AGRICULTURE SOURCE 347 HECTORS
(panta pandedi area)

TOTAL IRRIGATION LAND 137 HECTORS

UN-IRRIGATED LAND 400HECTORS
CAVELS(KALUVALU) 00 HECTORS
WELL-BOREWELLS 31 HECTORS
TANKS & LAKES 104 HECTORS
PRIMARY SCHOOL 01
PRIVATE SCHOOLS 02
HIGH SCHOOLS 01
MAHABUBNAGAR TO SINGOTAM DISTANCE (౯౫మ్ )...౯౫మ్









































































Friday, August 6, 2010

Singotam..Flash ..Flash..:ప్లాష్....ప్లాష్...!!!!!! కొన్ని కొంగ్రొత్త ఆలోచనలు!!!

ఫ్లాష్....ఫ్లాష్........తేది : 24 ఆగష్ట్...2010
24 ఆగష్ట్...2010....మంగళవారం .....
. చినుకు...చినుకు...కలిసింది.....చిందేసింది....ప్రకృతి మాత పురుడు పోసుకుందా అన్నట్లుగా వెల్లువలా నీటి ప్రవాహం..." బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది ".అన్న సామెత అక్షరాలా నిజమైంది.అంతక్రితం కురిసిన వర్షం....వాగులు ...వంకలు ఏకమై.......మెల్లి మెల్లి గా అలుగు పారడం మొదలైంది.......ఇది దాదాపు 11 గంటల తర్వాత మొదలైంది.......ఇంకా కొనసాగుతుంది.
ఆసక్తి.....ఉత్సాహం ఉన్నవారు.....త్వరగా వెల్లి చూడవచ్చు......" ఆలోచించిన ఆశాభంగం....
ఇంత మంచి అవకాశం మించిన దొరకదు"........
ఓ అద్భుతమైన సంఘటన.....ఇది సింగోటం లో ఓ రికార్ద్...అని చెప్పవచ్చును.
చాలా సంవత్సరాల తర్వాత....జరిగింది....2 సంవత్సరాలు వరుసగా సింగోటం శ్రీవారి సముద్రం నిండడం....ఓ వింతగా...రికార్ద్ గా ఈ ప్రాంత వాసులు....పెద్దలు....పరిశోధకులు చెప్తున్నారు.
సింగోటం చెరువుకు ఓ శాపం ఉంది.....దాని ప్రకారం ఈ చెరువు 7 ఏళ్ళకు ఓసారి మాత్రమే నిండుతుంది.
కాని పోయిన్ ఏడాది....ఈ ఏడాది......వరుసగా చెరువు నిండడం పట్ల ఈ ప్రాంత వాసుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు....సంబరాలు జరుపుకుంటున్నారు. ....

ప్లాష్....ప్లాష్...!!!!!!

కొన్ని కొంగ్రొత్త ఆలోచనలు!!!
సింగోటం....క్రొత్త...వింతలు...విశేషాలు.....
సింగోటం ప్రాంత పెద్దలకు...మిత్రులకు....యువతకు...మేధావులకు..శతకోటి నమస్సులతో.....నివేదించునది.....
సదాశయంతో సింగోటం యువత "ఓ స్వచ్ఛంద సంస్థకు" అంకురార్పణ చేయాలని ఆలోచిస్తున్నారు.
.....మీ వంతు ప్రయత్నంగా ఈ యజ్ఞంలో పాలు పంచుకొని...మీ సలహాలను...
సూచనలను.....ఆర్థిక ....హార్థిక సహాయంను ఆశిస్తూ....అహ్వానిస్తూ.....
ఏ విషయంలో నైనా.....కుల,మత,రాజకీయాలకు అతీతంగా పెద్దమనస్సుతో....ఆలోచించే....
విశాలహృదయులైన......మీ సింగోటం యువత......
ఆ అలోచనల సమాహారం :
1. ఓ స్వచ్ఛంద సంస్థ స్థాపనకు శ్రీకారం చుట్టడం.....
2.సింగోటం ప్రాంత విశిష్ఠతను తెలియ జేస్తూ....ఓ "హ్యాండ్ బుక్" ను రూపొందించాలి.
(దేవాలయ విశిష్ఠతను..గ్రామచరిత్ర...జనాభా లెక్కలు....గ్రామ ప్రగతి...వివిధ రంగాల్లో ప్రముఖులైన
వారి వివరాలు....పెద్దవారి అనుభవాలు.....ఇత్యాది విషయాలతో.....).
3 .మనకు విద్యాబుద్దులుగరిపి నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన జెడ్.పి.హెచ్.ఎస్.
హైస్కూలు..లో చదువుతున్న నిరుపేద విద్యార్థిని...విద్యార్థులకు....ఇతోధికంగా సహాయం చేయడం.
క్విజ్ పోటీలు...వ్యాసరచన ....డిబేట్ లాంటి కార్యక్రమాలు ..నిర్వహిస్తూ...విద్యార్థుల్లోని సృజనను ప్రోత్సహించడం.

4.ధనం మూలం మిదం జగత్.....(భూమండలం సూర్యుని చుట్టూ తిరుగుతుంది....మనిషి మాత్రం నిరంతరం
డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు....ఇది నగ్నసత్యం.).....మరి అన్ని పనులకు డబ్బే అవసరం....
ఏ చిన్న పనికైనా ....మనీ కావాలిగా? దాన్ని ఏ విధంగా ప్రోగు చేయాలి...ఇది వేనవేల ప్రశ్న ...?....
"మాటలు చెప్పమంటే కోటలు దాటవచ్చు....జేబు లోనుండి డబ్బు ఇవ్వమంటే
ఎవరు ఇస్తారు..."
! దీనికోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి .
5. పచ్చదనం -పరిశుభ్రత ( టి.డి.పి ప్రోగ్రాం కాదు)లో భాగంగా మన స్కూల్ చుట్టూ
వేప లేదా కానుగ చెట్ట్లు నాటాలి. 9 లేదా 10 వ తరగతి చదివే విద్యార్థినీ,విద్యార్థులు...
.ప్రతి ఒక్కరు ఒక మొక్కను సంరక్షించాలి. దీనికై ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
6..గ్రామంలో చిన్న చిన్న సమస్యలు,,,,వైరుధ్యాలు ఉన్నప్పటికి,,,,,మనమంతా ఒక్కటే అన్న
సమైక్య భావంతో...ఒకరికి మరొకరు...సహకారం అందించుకోవాలి.
7. జీవితంలో ఓ మధుర జ్ఞాపకం ...బాల్యం.....మరి ఆ చిన్నతనంలో మన స్కూలులోని చిలిపి అనుభవాలు...గిల్లి కజ్జాలు...పిప్పరమెంట్ల కోసం.ఫైటింగులు....సీటు కోసం....సిగపట్లు.... ఆ అనుభవాల సమాహారం......స్కూల్ అనుభవాలు - నా జ్ఞాపకాలు ప్రోగ్రాం.
8.స్కూల్ అనుభవాలు - నా జ్ఞాపకాలు ప్రోగ్రాం....ప్రస్థుతానికి 1993 -1995 బ్యాచ్ వరకే పరిమితం చేసాము.
1993 - 1994 - 1995.....సంవత్సరాలలో సింగోటం లో చదివిన బ్యాచ్ మిత్రులందరూ....
దసరా సెలవుల్లో కలుసుకొని తమ అనుభవాలు...అనుభూతులు....జ్ఞాపకాలు.....చెప్పుకొనేలా
మన క్లాస్ వాళ్లు ఎక్కడ? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారి కాంట్రాక్ట్ నంబర్స్....తీసుకొని....
వారికి తప్పక సమాచారం అందించండి.
గమనిక : ఇవన్నీ....తాత్కాలిక నిర్ణయాలే...మన కమిటీ ఏర్పాటు తర్వాత...మరిన్ని విషయాలు
మనస్సు విప్పిమాట్లాడుకుందాం...మధ్యాహ్న భోజన వేళాయను.....మళ్లీ కలుద్దాం ......
మరింత సమాచారంకై.......
తాత్కాలిక సంప్రదింపులకై......9866261996, 9000964558.
కూర్పు : మీ హితైషుడు......తూర్పింటి నరేశ్ కుమార్.....
ఎ.పి.ఐ.ఐ.ఐ.టి , బాసర .

Sunday, February 28, 2010

Introduction Of Singotam Lord NARASIMHA:నృసింహావతారము పరిచయం :వివరణ

ఏరియల్ వ్యూలో సింగపట్నం గ్రామ దేవాలయ చిత్రం
నృసింహావతారము పరిచయం :వివరణ
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణకై మరియు లోక కళ్యాణార్థమై
దశావతారములు ఎత్తాడు.
వాటిలో నృసింహావతారము నాల్గవది.
సంస్కృత సాహిత్యంలో అవతార గాథ కథాత్మకంగా
స్తోత్ర రత్నంగా వుంది.
తెలుగులో ఎఱ్ఱాప్రగడ మొదలైన వారు కావ్యాలు వ్రాశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 40 వరకు నృసింహా లయాలు వున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి 22 అచ్చంపేట మండలంలో కల్వకుర్తి మండలంలో, వనపర్తి మండలంలో
నాగర్ కర్నూల్ మండలంలో అధికంగా కొల్లపూర్ మక్తల్ అలంపూర్
జడ్చర్ల మండలాల్లో ఒక్కోక్క నృసింహా లయాలు వున్నాయి
మహబూబ్ నగర్ మండలం కోయిలకొండలోని
నృసింహ స్వామి ఉగ్రావతారుడు.వనపర్తి మండలంలోని అంకూర్లో ,కొల్లపూర్ మండలంలోని
సింగపట్నంలో, మక్తల్ మండలంలోని ,మంగనూర్లో లక్ష్మినృసింహా ఆలయాలు వున్నాయి.
సింగపట్టణం (సింగోటం) లక్ష్మినృసింహా స్వామి జాతర :
పరిచయం కొల్లపూర్ మండల కేంద్రానికి 9 కి .మీ. దూరంలో
సింగోటం(సింగపట్టణం ) గ్రామంలో శ్రీలక్ష్మినృసింహాస్వామి
లింగరూపంలో వెలియడాన్ని విశేషంగా చెపుతారు.
శివకేశవులకు ఆభేదం లేకుండా స్వామివారు ' త్రిపూండ్రాలు ...ఊర్ధ్వపూండ్రాలు
కలిగి స్వయంభూఃగా ఈ ప్రాంతంలో వెలిశారు.
తదనంతర కాలంలో స్వామి ఆలయ పాదానికి కుడివైపున శివాలయ ప్రతిష్ట,
రత్నగిరికొండపై రత్నలక్ష్మీ అమ్మవారి ప్రతిష్టను చేశారు .

శ్రీలక్ష్మినృసింహాస్వామి గోవిందా....గోవిందా..... అంటూ మిన్ను ముట్టే భక్తుల గొంతుకలతో
సిగమెత్తే శివసత్తుల కోలాహాలంతో వేలాది భక్తుల భక్తి పారవశ్యంతో కోలాటంవేసే భక్త మండలి ఉత్సహనందాలతో మకర సంక్రాంతి మొదలుకొని .....నెలరోజుల పాటు
ఉత్సవాలు చూపరులకు నయనాందాన్నికలుగజేస్తాయి . ప్రతీ సంవత్సరము జరిగే ఈ
జాతరకు మహబూబ్ నగర్ జిల్లాయే గాక ఇరుగు పొరుగు జిల్లావాసులతో పాటు
కర్ణాటక ,రాజస్థాన్ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకోని తరిస్తారు.
దేవాలయ స్థల ఐతిహ్యం:
జిల్లాలోని ప్రాచీనమైన ప్రసిద్ధి నొందిన దేవాలయాల్లో .....
సింగోటం(సింగపట్టణం )లక్ష్మినృసింహా స్వామి దేవాలయం ఒక్కటి రత్నగిరి కొండకు అభిముఖంగా స్వామివారు ఈ ప్రాంతంలో కొలువుదీరటానికి ముందు ఆసక్తికరమైన 600 సంవత్సరాల చారిత్రక గాథఒకటి వుంది .
సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనాయుడు అను భూపాలుడు జటప్రోలు ప్రాంతాన్ని కేంద్రంగా పరిపాలిస్తున్న రోజులవి.ఆ జిల్లాలో సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక యాదవుడు ప్రతిదినం తెల్లవారు ఝామున 'గోర్కోలు' (గొర్రుకొయ్యలు )చూసు కుంటూ తన పొలములో అరక దున్నుతుంటాడు.

అపుడు లింగరూపంలో ఉన్న ఒక నల్లని సరుపరాయి నాగలికి అడ్డు తగలుతూ అతని పనికి అంతరాయం కలిగించేదట.
రైతు ఆ శిలను ఎన్ని సార్లు ప్రక్కకు చేర్చినా అదే స్థలానికి చేరుతుండటంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు.
ఆశిల మహిమను ఆతడు గుర్తించలేకపోయాడు. ఆవిధంగా కొన్ని రోజులు గడిచాయి.
ఆ యాదవుడు తాను పేదవాడినని, తన పనికి అంతరాయం కలుగకుండా కరుణించమని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. భక్తుని మొర నిన్న శిలారూపంలోని స్వామి ఆ రాత్రి నేరుగా భూపాలుడైన ' సింగమనాయునికి ' స్వప్నరూపంలో సాక్షాత్కరిస్తాడు. ' తాను ఉత్తర దిశలో రెండు ఆమడల దూరంలో గల ఒక రైతు పొలంలో లింగరూపంలో వెలిశానని, రోజూ నాగలికి అడ్డుపడుతూ ఉన్నా రైతు తనను గుర్తించడం లేదని, ఇదే దినం తనను గుర్తించి వెంటనే ప్రతిష్ఠించి పూజలు జరుపమని శాసించడంతో సింగమనాయుడు నిద్రనుండి ఉలిక్కిపడి లేచి తాను కలలో విన్నది, కన్నది ఇంతవరకు నిజమో అనుకొని సైన్యంతో లింగ రూపంలో వున్న ఒక శిల కాంతివంతంగా వెలుగుతూ కనిపించింది. కలలో స్వామిని, ప్రజలు తోడురాగా ప్రస్తుతం వున్న ఆలయం వెనక ఎత్తైన బండ ప్రాంతానికి రాగానే స్వామి శిలను తలపై ఎత్తుకున్న వానికి ఆవహిస్తాడు.
తాను లక్ష్మి నృసింహున్నని చెప్పుకుంటాడు. ప్రప్రధమంగా స్వామి ప్రతిమను
అక్కడే దించారు.కనుక దీనికి " పాదం గుడి"అని పేరు.
సింగమ భూపాలుడు బ్రాహ్మణులైన ఓరుగంటి వంశీయుల సహకారంతో స్వామిని గంగాజలంతో అభిషేకించి ప్రతిష్ఠించారనేది ఈ స్థల ఐతిహ్యం. అప్పట్లో స్వామి వారికి ఎండ తగలకుండా ఉండటానికి నాపరాయితో నిర్మించిన అతి సామాన్యమైన చిన్న గుడి గర్భగుడిలో నేటికీ కనిపిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది . స్వామివారు వెలసిన నాటి నుండినేటికి నిర్విఘ్నంగా నిత్యం పూజాభిషేకాలు జరుగుతున్నాయి.

సింగపట్టణ క్షేత్ర ప్రసక్తి "మదన గోపాల మాహాత్మ్యము" అను స్థల పూరాణంలో వుంది. దాని ప్రకారం పూర్వం ఇది అరణ్య ప్రాంతం. కాశి నుండి'సింగవటువు' అనే బ్రహ్మచారి ఈ మగతలో అతనికి "నీవు అహోబిలం వరకు రానక్కరలేదు.ఇక్కడనే ఉండి తపస్సు చేయి అనే ఆదేశం వినిపించింది. అది విన్న అతడు అక్కడనే ఒక పురాతన వటవృక్షాన్ని ఆశ్రయించి తపస్సు కొనసాగించాడు. కొన్ని దినాలకు స్వామికి అతని పై అనుగ్రహం కిలిగి,, పొదలి కొండపై ఒక పాదం మోపి, అక్కడి రాతిగుట్ట పై రెందో పాదం మోపి అతనికి దర్శనమిస్తాడు. ఇక్కడి నృసింగమూర్తిని లింగాకారంలో పూజిస్తున్నారు. వికారాబాద్ సమీపంలో 'అనంతగిరిలో నృసింహస్వామి' ఈ విధంగానే ఉంటాడు.

3.4.3 స్వామి ఆకృతి :
నృసింహ స్వామి ప్రతిష్ఠ జరిపిన కాలంలోనే ఆంజనేయ ప్రతిష్ఠ జరిగింది . ఈ క్షేత్రంలో వెలసిన స్వామి లింగాకారంలో గల నృసింహుడు. స్వామికి ఒక కన్ను క్రిందకు, ఒక కన్ను మీదకు వుంటుంది. ఎడమకన్ను క్రిందగల భాగంలో కమలం వుంది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామి లక్ష్మీ నృసింహుండు అయ్యాడు. స్వామి వెలసిన రాతి కొండకు 'శ్వేతాద్రి'అని పేరు.
3.4.4 రత్నలక్ష్మి అమ్మవారు :
శ్రీలక్ష్మీ నృసింగస్వామి ఆలయానికి అభిముఖంగా అర కిలోమిటరు దూరంలో రత్నగిరి అనే పేరుగల ఎత్తైన కొండ వుంది. ఆ కొండ పై రత్న లక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. స్వామి హృదయం పై గల కమలం లక్ష్మీ స్థానం కనుక లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు కనిపించడం లేదు. అందువల్ల రాణి రత్నమాంబ హయాంలో 148 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి క్రీ.శ. 1857 లో రత్నలక్ష్మీదేవి విగ్రహాన్ని తీసికొని వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ కొండ పై ఆహ్లాదకరమైన వాతావరణంలో కొల్లాపూర్ రాజావారి పురాతనమైన విడిది భవనం వుంది. చుట్టుప్రక్కల గ్రామాల వాటికి విద్యార్ధులకు ఈ రత్నగిరి కొండ 'పిక్నిక్ స్పాట్'గా ఉపయోగపడుతోంది.

3.4.5 హరిహరాద్వైతం - వివాదం :

"లింగాకారం త్రిపుండ్రాంకాం -కేవలం జ్ఞానమూర్తినాం

ద్వంద్వాతీతం మహోపాశ్వం -అబేధంశివకేశవమ్ "

భావం : లింగారంలోనూ త్రిపుండ్రములను, జ్నానమూర్తిత్త్వంలోనూ, ద్వందాతీతులైన శివ, కేశవులు అభేద స్వరూపులు. ఈ శ్లోకంలో శివ, కేశవుల అభేదం ప్రతి పాదించారు.
నృసింహాస్వామిని సింగపట్టణం క్షేత్రంలో లింగాకారంలో పూజిస్తున్నారు . స్వామికి త్రిపుండ్రం ఊర్ధ్వపుండ్రాలు ఉన్నాయి .కనుక ఇది హరిహరాద్వైత్వం. ఇచట పూజాదికాలు నిర్వర్తించేది స్మార్తులైన ఓరుగంటి వంశీయులు. శైవ, వైష్ణవ పట్టింపులు అధికంగా ఉన్న కాలంలో శైవులకు, వైష్ణవులకు అర్చకత్వం విషయంలో వివాదం ఏర్పదింది. అపుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబగారు& పుష్పగిరి స్వామి చూస్తే, స్వామి వారికి అడ్డనామాలతో పాటు నిలువు నామాలు కనిపించాయి. అందువల్ల ఈ స్వామిని దర్శించిన వైష్ణవులకు..... వైష్ణవుడైన ' ఎంబళ పెరుమాండ్లు ' దర్శించాలనే నియమం ఏర్పాటు చేశారు.
ఆ సమయంలోనే ఆలయపాదానికి కుడివైపున పుష్కరిణి ప్రక్కన శివాలయాన్ని కూడా నిర్మింపజేశారు. ఈ ప్రాంతపు స్మార్తులు శివ, కేశవ భేదం లేకుండా పూజాదికాలు నిర్వర్తిస్తారు. అందువలన వారికే అర్చన బాధ్యతలు
అప్పగించారు. ఇక్కడ స్వామి వారు హరిహరాద్వైతం అయినప్పటికీ సామాన్య ప్రజానీకం వైష్ణవ రూపంలోనే గోవిందా..గోవిందా...అంటూ స్వామివారిని కొలవడం విశేషం.

3.4.6 పుష్కరిణి :
నృసింహాస్వామి ఆలయ పాదానికి కుడివైపున గల పవితర గుండంలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించినంతనే సర్వరోగాలు హరించిపోతాయని, మనసారా స్వామిని ధ్యానించి తలనీలాలు సమర్పించుకొని ఈ గుండంలో స్నానాలు చేస్తే సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ తడిబట్టలతోనే మ్రొక్కులు చెల్లించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం.
తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఈ ప్రాంతంలోని జలాశయాలు ఎండిపోయినా ఈ పరిత్రగుండన్లో మాత్రం సర్వకాల సర్వావస్థల్లో నీరు ఉండటం ప్రత్యేకత. భక్తులు మొక్కుగా బెల్లంగడ్డలు పుష్కరిణి
లో వేస్తే తమ రోగాలు స్వామి హరింపజేస్తాడనేది ఈ ప్రాంత జానపదుల విశ్వాసం .

3.4.7 దేవాలయాభివృద్ధి :
మొదట నాపరాయితో అతి సామాన్యంగానిర్మించిన ఈ దేవాలయం తర్వాతి కాలంలో అభివృద్ధికి నోచుకుంది. నిజాం కాలంలో మంత్రి అయిన చందూలాల్ బహద్దూర్ గారు ఈ దేవలయాన్ని దర్శించి దీని అభివృద్ధి నిమిత్తం 240 ఇకరాల మెట్ట 12 ఎకరాల మాగాణిని అర్చకులైన్ అ లక్ష్మీ నరసింహయ్య శాస్త్రిగారి హయాంలో అర్చకత్వానికి రాసి ఇచ్చరు. దీన్ని 'దేవునిమాన్యం ' గావ్యవహరిస్తారు. స్వామి ప్రాచినుడైనప్పటికీ ఆలయ నిర్మాణం మాత్రం చాలాకాలం తర్వాత అనగా సన్ 1215 అనగా క్రీ.శ. 1795లో నిర్మించారు. గర్భగుడి 40 అంకణాల మంటపాన్ని
అర్చకుడైన రాఘవ సోమయాజి కాలంలో నిర్మించారు. ఇక్కడ గల సత్రశాలను కర్నూలు నివాసి కటకం బొర్రయ్య శెట్టి కుమారుడు బారయ్య సెట్టి శాలివాహన శకం 1819 హేవిలంబి మార్గశుద్ధ భానువారం(క్రీ.శ. 1897)లో నిర్మించాడు.కొల్లాపూర్ రాణి వెంకట రత్నమాంబ గారు స్వామి గాలిగోపురాన్ని కట్టించింది.
*క్రీ.శ. 1854లో స్వామికి ఎదురుగా గల గుట్టకు రత్నగిరి అనే పేరు పేట్టి, రత్నలక్ష్మీ దేవాలయాన్ని, పద్మనిలయం అనే విలాస భవనాన్ని రత్నమాంబ గారు కట్టించి, తోట వేయించింది.
శాలివాహన శకం 1881 లో భక్తులు తేరును చేయించగా దినికి ఎదిరె నర్సింగరావు గారు రథశాలను కట్టించినారు.
*శాలివాహన 1886లో సురభి వెంకట జగన్నాథరావు గారు ఆలయ పాదానికి కుడివైపున గలగుండానికి
స్నానాలమెట్లు కట్టించినారు.
*1890లో శ్రీమతి ఇందిరాదేవి గారి స్మారకంగా, నృసింగసాగరానికి కాలువను సురభి వంశస్థులు నిర్మించారు.

3.4.8 బ్రహ్మోత్సవాలు - జాతర : '
మకరే రవి :అన్నట్లుగా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఆ సందర్భంలో సంక్రాంతి మొదలుకొని దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో జాతర జరుగుతుంది.
జనవరి 14 వ తేదిన స్వామివారికి పూజా కైంకర్యం ,మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వరకు శకటోత్సవం జరుగుతుంది. ఈ రోజున శకటోత్సవం వెశేషంగా జరుగుతుంది. ఫలారం బండ్ల రోజున సింగపట్టణం చుట్టుపక్కల గ్రామాల వారు ఎద్దులను బండ్లను అలంకరించి స్వామికి ఎదురుగా గల జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకోవడంతో ఉత్సవం ముగుస్తుంది.
* 15వ తేదీన స్వామి వారికి కళ్యాణోత్సవం, రధం పై మోహినీసేవ గజవాహన సేవ వుంటాయి.
*16 వ తేదీన సింహవానంతో రధం పై ప్రభోత్సవం జరుగుతుంది.
* 17వ తేదీన రధోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 -30 నిమిషాలకుఆ తర్వాత
దాదాపు లక్షమంది స్వామివారిని దర్శించుకుంటారు.
తెప్పోత్సవంను రాత్రి 8 -00 .....నుండి ఉ 10 -00 గంటల వరకు నిర్వహించారు.
* 19 వ తేదీన శేషవాహన సేవ, తీర్ధావళి తదనంతరం పానుపు సేవలు జరుగుతాయి.
* గర 3 సంవత్సరాల నుండి ఫొండర్ ట్రస్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి యాగాన్ని లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్నారు
3.4.9 సాహితీ సంపద :
స్వామిఅవతారం నృసింహు డైనప్పటెకీ కోరిన కోర్కెలను నెరవేర్చేదైవంగా ఈ స్వామి ఖ్యతినొందారు. ఈ ప్రాంత స్వామి పై అక్షరలక్షలు విలువ చేసే సాహితీ సృష్టి జరిగింది. సురభి వంశంలో 26 వ తరం రాజైన శ్రీవేంకట జగన్నాధరావు కాలంలో కవి సార్వభౌ బిరుదాంకితుటైన హోసదుర్గం కృష్ణమాచార్యూలు సింగపట్నం నృసింహస్వామికి అంకితంగా " లక్ష్మీ నృసింహవిలాసం" అను సంస్క్రత చంపవును రచించాడు.

"సింగపట్న నృసింహ శతకం" ను, సింగపట్టణ నరసింహ విలాసం"
"సింగపట్టణ నృసింహ క్షేత్ర మా హాత్మ్యం"ను రచించారు.సింగపట్టణ నృసింహశతకం మకుటం ' సింగవట నరసింహ ' సింగపట్టణం నివాసియైన శ్రీవత్సస గోత్రీకులైన ఓరుగంటి లక్ష్మీ నారాయణగారు " సింగపట్నం లక్ష్మీ నృసింహస్వామి చరితం" అను వచన కృతిని రచించారు .
ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ ' నవరత్నస్తోత్రమాల ' ను రచించారు.
3.4.10 ప్రత్యేకతలు - ముగింపు :
* ఈక్షేత్రంలో స్వామి నృసింహుడు అయినప్పటికీ లింగరూపంలో వుంటాడు. స్వామికి త్రిపుండ్రాలు, ఊర్ధ్వ పుండ్రాలు వుండటం వలన స్వామి హరిహరాద్వైతంనకు ప్రతిరూపంగా నిలుస్తాడు.
*స్వయం భూ : అయిన స్వామికి అర్చకులుగా స్మార్తులైన శ్రీవత్స గోత్రీకులు, ఓరుగంటి వంశీయులు ఇప్పటికి కొనసాగుతూనే వున్నారు.
* నృసింహస్వామికి అభిముఖంగా 1 కి.మీ. దూరంలో గిరిపై రత్న లక్ష్మీ అమ్మవారు వెలిశారు.
*సంకటాలు వున్న వారు ఈ ఆలయంలో గండదీపం మోసి తమ మ్రొక్కులను చెల్లించుకుంటారు. ఈ స్వామికి మ్రొక్కు క్రింది గు మ్మడికాయలు సమర్పించుకుంటారు. గొల్లదాసరులు ఈ స్వామి సేవలో తరిస్తారు.
* భక్తులు పవిత్ర గుండలో బెల్లం గడ్డలు వేసి తమ బరువులను తొలగించుకుంటారు.
*స్వామి ఆలయ పాదానికి ఎడమవైపున నృసింహసాగరం ప్రతీ 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూర్తిగా
నిండి అలుగు పారుతుంది.
* భక్తులకు స్వామి ఆవాహన అయ్యి భూత ,భవిష్యత్ కాలాలను గురించి చెప్తాడు.
*స్వయం భూ అయిన ఈ స్వామి ఏకాదికేడాది క్రమక్రమంగా పెరుగుతున్నాడని భక్తులూ విశ్వసిస్తున్నారు.

స్వామి ఆవిర్భవించిన సందర్భంలో...
స్వామి ----- నృసింహుడు, .........భూపాలుడు ---- సింగమనాయుడు
గ్రామం ---- సింగపట్టణం ......తొలి అర్చకుడు ---- నరసింహయ్య శాస్త్రి
కాకతాళీయంగా ఒకటే కావడం వెశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నొ వింతలకు, వెశేషాలకు, విశ్వాసాలకు నిలయం ఈసింగపట్టణం . శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతర ఈ ప్రాంత జనుల సంస్క్రతికి దర్పణం పడుతుంది. కుల, మత వర్గాలకు అతీతంగా జానపదులను ఒకేత్రాటి పై నడుపుతోంది. వర్తమాన పరిస్థితుల ప్రభావాన్ని తన దరికి చేరనివ్వకుండా భక్తుల పాలిట కోరిన కోర్కెల కొంగు బంగారమై ఆదర్శంగా నిలుస్తోంది.
[ఆధారం :"కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు ఒక పరిశీలన "తూర్పింటి నరేశ్ కుమార్ ]
naresh.tuurpinti@gmail.com......9000964558