Sunday, February 28, 2010

Introduction Of Singotam Lord NARASIMHA:నృసింహావతారము పరిచయం :వివరణ

ఏరియల్ వ్యూలో సింగపట్నం గ్రామ దేవాలయ చిత్రం
నృసింహావతారము పరిచయం :వివరణ
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణకై మరియు లోక కళ్యాణార్థమై
దశావతారములు ఎత్తాడు.
వాటిలో నృసింహావతారము నాల్గవది.
సంస్కృత సాహిత్యంలో అవతార గాథ కథాత్మకంగా
స్తోత్ర రత్నంగా వుంది.
తెలుగులో ఎఱ్ఱాప్రగడ మొదలైన వారు కావ్యాలు వ్రాశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 40 వరకు నృసింహా లయాలు వున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి 22 అచ్చంపేట మండలంలో కల్వకుర్తి మండలంలో, వనపర్తి మండలంలో
నాగర్ కర్నూల్ మండలంలో అధికంగా కొల్లపూర్ మక్తల్ అలంపూర్
జడ్చర్ల మండలాల్లో ఒక్కోక్క నృసింహా లయాలు వున్నాయి
మహబూబ్ నగర్ మండలం కోయిలకొండలోని
నృసింహ స్వామి ఉగ్రావతారుడు.వనపర్తి మండలంలోని అంకూర్లో ,కొల్లపూర్ మండలంలోని
సింగపట్నంలో, మక్తల్ మండలంలోని ,మంగనూర్లో లక్ష్మినృసింహా ఆలయాలు వున్నాయి.
సింగపట్టణం (సింగోటం) లక్ష్మినృసింహా స్వామి జాతర :
పరిచయం కొల్లపూర్ మండల కేంద్రానికి 9 కి .మీ. దూరంలో
సింగోటం(సింగపట్టణం ) గ్రామంలో శ్రీలక్ష్మినృసింహాస్వామి
లింగరూపంలో వెలియడాన్ని విశేషంగా చెపుతారు.
శివకేశవులకు ఆభేదం లేకుండా స్వామివారు ' త్రిపూండ్రాలు ...ఊర్ధ్వపూండ్రాలు
కలిగి స్వయంభూఃగా ఈ ప్రాంతంలో వెలిశారు.
తదనంతర కాలంలో స్వామి ఆలయ పాదానికి కుడివైపున శివాలయ ప్రతిష్ట,
రత్నగిరికొండపై రత్నలక్ష్మీ అమ్మవారి ప్రతిష్టను చేశారు .

శ్రీలక్ష్మినృసింహాస్వామి గోవిందా....గోవిందా..... అంటూ మిన్ను ముట్టే భక్తుల గొంతుకలతో
సిగమెత్తే శివసత్తుల కోలాహాలంతో వేలాది భక్తుల భక్తి పారవశ్యంతో కోలాటంవేసే భక్త మండలి ఉత్సహనందాలతో మకర సంక్రాంతి మొదలుకొని .....నెలరోజుల పాటు
ఉత్సవాలు చూపరులకు నయనాందాన్నికలుగజేస్తాయి . ప్రతీ సంవత్సరము జరిగే ఈ
జాతరకు మహబూబ్ నగర్ జిల్లాయే గాక ఇరుగు పొరుగు జిల్లావాసులతో పాటు
కర్ణాటక ,రాజస్థాన్ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకోని తరిస్తారు.
దేవాలయ స్థల ఐతిహ్యం:
జిల్లాలోని ప్రాచీనమైన ప్రసిద్ధి నొందిన దేవాలయాల్లో .....
సింగోటం(సింగపట్టణం )లక్ష్మినృసింహా స్వామి దేవాలయం ఒక్కటి రత్నగిరి కొండకు అభిముఖంగా స్వామివారు ఈ ప్రాంతంలో కొలువుదీరటానికి ముందు ఆసక్తికరమైన 600 సంవత్సరాల చారిత్రక గాథఒకటి వుంది .
సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనాయుడు అను భూపాలుడు జటప్రోలు ప్రాంతాన్ని కేంద్రంగా పరిపాలిస్తున్న రోజులవి.ఆ జిల్లాలో సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక యాదవుడు ప్రతిదినం తెల్లవారు ఝామున 'గోర్కోలు' (గొర్రుకొయ్యలు )చూసు కుంటూ తన పొలములో అరక దున్నుతుంటాడు.

అపుడు లింగరూపంలో ఉన్న ఒక నల్లని సరుపరాయి నాగలికి అడ్డు తగలుతూ అతని పనికి అంతరాయం కలిగించేదట.
రైతు ఆ శిలను ఎన్ని సార్లు ప్రక్కకు చేర్చినా అదే స్థలానికి చేరుతుండటంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు.
ఆశిల మహిమను ఆతడు గుర్తించలేకపోయాడు. ఆవిధంగా కొన్ని రోజులు గడిచాయి.
ఆ యాదవుడు తాను పేదవాడినని, తన పనికి అంతరాయం కలుగకుండా కరుణించమని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. భక్తుని మొర నిన్న శిలారూపంలోని స్వామి ఆ రాత్రి నేరుగా భూపాలుడైన ' సింగమనాయునికి ' స్వప్నరూపంలో సాక్షాత్కరిస్తాడు. ' తాను ఉత్తర దిశలో రెండు ఆమడల దూరంలో గల ఒక రైతు పొలంలో లింగరూపంలో వెలిశానని, రోజూ నాగలికి అడ్డుపడుతూ ఉన్నా రైతు తనను గుర్తించడం లేదని, ఇదే దినం తనను గుర్తించి వెంటనే ప్రతిష్ఠించి పూజలు జరుపమని శాసించడంతో సింగమనాయుడు నిద్రనుండి ఉలిక్కిపడి లేచి తాను కలలో విన్నది, కన్నది ఇంతవరకు నిజమో అనుకొని సైన్యంతో లింగ రూపంలో వున్న ఒక శిల కాంతివంతంగా వెలుగుతూ కనిపించింది. కలలో స్వామిని, ప్రజలు తోడురాగా ప్రస్తుతం వున్న ఆలయం వెనక ఎత్తైన బండ ప్రాంతానికి రాగానే స్వామి శిలను తలపై ఎత్తుకున్న వానికి ఆవహిస్తాడు.
తాను లక్ష్మి నృసింహున్నని చెప్పుకుంటాడు. ప్రప్రధమంగా స్వామి ప్రతిమను
అక్కడే దించారు.కనుక దీనికి " పాదం గుడి"అని పేరు.
సింగమ భూపాలుడు బ్రాహ్మణులైన ఓరుగంటి వంశీయుల సహకారంతో స్వామిని గంగాజలంతో అభిషేకించి ప్రతిష్ఠించారనేది ఈ స్థల ఐతిహ్యం. అప్పట్లో స్వామి వారికి ఎండ తగలకుండా ఉండటానికి నాపరాయితో నిర్మించిన అతి సామాన్యమైన చిన్న గుడి గర్భగుడిలో నేటికీ కనిపిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది . స్వామివారు వెలసిన నాటి నుండినేటికి నిర్విఘ్నంగా నిత్యం పూజాభిషేకాలు జరుగుతున్నాయి.

సింగపట్టణ క్షేత్ర ప్రసక్తి "మదన గోపాల మాహాత్మ్యము" అను స్థల పూరాణంలో వుంది. దాని ప్రకారం పూర్వం ఇది అరణ్య ప్రాంతం. కాశి నుండి'సింగవటువు' అనే బ్రహ్మచారి ఈ మగతలో అతనికి "నీవు అహోబిలం వరకు రానక్కరలేదు.ఇక్కడనే ఉండి తపస్సు చేయి అనే ఆదేశం వినిపించింది. అది విన్న అతడు అక్కడనే ఒక పురాతన వటవృక్షాన్ని ఆశ్రయించి తపస్సు కొనసాగించాడు. కొన్ని దినాలకు స్వామికి అతని పై అనుగ్రహం కిలిగి,, పొదలి కొండపై ఒక పాదం మోపి, అక్కడి రాతిగుట్ట పై రెందో పాదం మోపి అతనికి దర్శనమిస్తాడు. ఇక్కడి నృసింగమూర్తిని లింగాకారంలో పూజిస్తున్నారు. వికారాబాద్ సమీపంలో 'అనంతగిరిలో నృసింహస్వామి' ఈ విధంగానే ఉంటాడు.

3.4.3 స్వామి ఆకృతి :
నృసింహ స్వామి ప్రతిష్ఠ జరిపిన కాలంలోనే ఆంజనేయ ప్రతిష్ఠ జరిగింది . ఈ క్షేత్రంలో వెలసిన స్వామి లింగాకారంలో గల నృసింహుడు. స్వామికి ఒక కన్ను క్రిందకు, ఒక కన్ను మీదకు వుంటుంది. ఎడమకన్ను క్రిందగల భాగంలో కమలం వుంది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామి లక్ష్మీ నృసింహుండు అయ్యాడు. స్వామి వెలసిన రాతి కొండకు 'శ్వేతాద్రి'అని పేరు.
3.4.4 రత్నలక్ష్మి అమ్మవారు :
శ్రీలక్ష్మీ నృసింగస్వామి ఆలయానికి అభిముఖంగా అర కిలోమిటరు దూరంలో రత్నగిరి అనే పేరుగల ఎత్తైన కొండ వుంది. ఆ కొండ పై రత్న లక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. స్వామి హృదయం పై గల కమలం లక్ష్మీ స్థానం కనుక లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు కనిపించడం లేదు. అందువల్ల రాణి రత్నమాంబ హయాంలో 148 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి క్రీ.శ. 1857 లో రత్నలక్ష్మీదేవి విగ్రహాన్ని తీసికొని వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ కొండ పై ఆహ్లాదకరమైన వాతావరణంలో కొల్లాపూర్ రాజావారి పురాతనమైన విడిది భవనం వుంది. చుట్టుప్రక్కల గ్రామాల వాటికి విద్యార్ధులకు ఈ రత్నగిరి కొండ 'పిక్నిక్ స్పాట్'గా ఉపయోగపడుతోంది.

3.4.5 హరిహరాద్వైతం - వివాదం :

"లింగాకారం త్రిపుండ్రాంకాం -కేవలం జ్ఞానమూర్తినాం

ద్వంద్వాతీతం మహోపాశ్వం -అబేధంశివకేశవమ్ "

భావం : లింగారంలోనూ త్రిపుండ్రములను, జ్నానమూర్తిత్త్వంలోనూ, ద్వందాతీతులైన శివ, కేశవులు అభేద స్వరూపులు. ఈ శ్లోకంలో శివ, కేశవుల అభేదం ప్రతి పాదించారు.
నృసింహాస్వామిని సింగపట్టణం క్షేత్రంలో లింగాకారంలో పూజిస్తున్నారు . స్వామికి త్రిపుండ్రం ఊర్ధ్వపుండ్రాలు ఉన్నాయి .కనుక ఇది హరిహరాద్వైత్వం. ఇచట పూజాదికాలు నిర్వర్తించేది స్మార్తులైన ఓరుగంటి వంశీయులు. శైవ, వైష్ణవ పట్టింపులు అధికంగా ఉన్న కాలంలో శైవులకు, వైష్ణవులకు అర్చకత్వం విషయంలో వివాదం ఏర్పదింది. అపుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబగారు& పుష్పగిరి స్వామి చూస్తే, స్వామి వారికి అడ్డనామాలతో పాటు నిలువు నామాలు కనిపించాయి. అందువల్ల ఈ స్వామిని దర్శించిన వైష్ణవులకు..... వైష్ణవుడైన ' ఎంబళ పెరుమాండ్లు ' దర్శించాలనే నియమం ఏర్పాటు చేశారు.
ఆ సమయంలోనే ఆలయపాదానికి కుడివైపున పుష్కరిణి ప్రక్కన శివాలయాన్ని కూడా నిర్మింపజేశారు. ఈ ప్రాంతపు స్మార్తులు శివ, కేశవ భేదం లేకుండా పూజాదికాలు నిర్వర్తిస్తారు. అందువలన వారికే అర్చన బాధ్యతలు
అప్పగించారు. ఇక్కడ స్వామి వారు హరిహరాద్వైతం అయినప్పటికీ సామాన్య ప్రజానీకం వైష్ణవ రూపంలోనే గోవిందా..గోవిందా...అంటూ స్వామివారిని కొలవడం విశేషం.

3.4.6 పుష్కరిణి :
నృసింహాస్వామి ఆలయ పాదానికి కుడివైపున గల పవితర గుండంలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించినంతనే సర్వరోగాలు హరించిపోతాయని, మనసారా స్వామిని ధ్యానించి తలనీలాలు సమర్పించుకొని ఈ గుండంలో స్నానాలు చేస్తే సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ తడిబట్టలతోనే మ్రొక్కులు చెల్లించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం.
తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఈ ప్రాంతంలోని జలాశయాలు ఎండిపోయినా ఈ పరిత్రగుండన్లో మాత్రం సర్వకాల సర్వావస్థల్లో నీరు ఉండటం ప్రత్యేకత. భక్తులు మొక్కుగా బెల్లంగడ్డలు పుష్కరిణి
లో వేస్తే తమ రోగాలు స్వామి హరింపజేస్తాడనేది ఈ ప్రాంత జానపదుల విశ్వాసం .

3.4.7 దేవాలయాభివృద్ధి :
మొదట నాపరాయితో అతి సామాన్యంగానిర్మించిన ఈ దేవాలయం తర్వాతి కాలంలో అభివృద్ధికి నోచుకుంది. నిజాం కాలంలో మంత్రి అయిన చందూలాల్ బహద్దూర్ గారు ఈ దేవలయాన్ని దర్శించి దీని అభివృద్ధి నిమిత్తం 240 ఇకరాల మెట్ట 12 ఎకరాల మాగాణిని అర్చకులైన్ అ లక్ష్మీ నరసింహయ్య శాస్త్రిగారి హయాంలో అర్చకత్వానికి రాసి ఇచ్చరు. దీన్ని 'దేవునిమాన్యం ' గావ్యవహరిస్తారు. స్వామి ప్రాచినుడైనప్పటికీ ఆలయ నిర్మాణం మాత్రం చాలాకాలం తర్వాత అనగా సన్ 1215 అనగా క్రీ.శ. 1795లో నిర్మించారు. గర్భగుడి 40 అంకణాల మంటపాన్ని
అర్చకుడైన రాఘవ సోమయాజి కాలంలో నిర్మించారు. ఇక్కడ గల సత్రశాలను కర్నూలు నివాసి కటకం బొర్రయ్య శెట్టి కుమారుడు బారయ్య సెట్టి శాలివాహన శకం 1819 హేవిలంబి మార్గశుద్ధ భానువారం(క్రీ.శ. 1897)లో నిర్మించాడు.కొల్లాపూర్ రాణి వెంకట రత్నమాంబ గారు స్వామి గాలిగోపురాన్ని కట్టించింది.
*క్రీ.శ. 1854లో స్వామికి ఎదురుగా గల గుట్టకు రత్నగిరి అనే పేరు పేట్టి, రత్నలక్ష్మీ దేవాలయాన్ని, పద్మనిలయం అనే విలాస భవనాన్ని రత్నమాంబ గారు కట్టించి, తోట వేయించింది.
శాలివాహన శకం 1881 లో భక్తులు తేరును చేయించగా దినికి ఎదిరె నర్సింగరావు గారు రథశాలను కట్టించినారు.
*శాలివాహన 1886లో సురభి వెంకట జగన్నాథరావు గారు ఆలయ పాదానికి కుడివైపున గలగుండానికి
స్నానాలమెట్లు కట్టించినారు.
*1890లో శ్రీమతి ఇందిరాదేవి గారి స్మారకంగా, నృసింగసాగరానికి కాలువను సురభి వంశస్థులు నిర్మించారు.

3.4.8 బ్రహ్మోత్సవాలు - జాతర : '
మకరే రవి :అన్నట్లుగా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఆ సందర్భంలో సంక్రాంతి మొదలుకొని దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో జాతర జరుగుతుంది.
జనవరి 14 వ తేదిన స్వామివారికి పూజా కైంకర్యం ,మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వరకు శకటోత్సవం జరుగుతుంది. ఈ రోజున శకటోత్సవం వెశేషంగా జరుగుతుంది. ఫలారం బండ్ల రోజున సింగపట్టణం చుట్టుపక్కల గ్రామాల వారు ఎద్దులను బండ్లను అలంకరించి స్వామికి ఎదురుగా గల జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకోవడంతో ఉత్సవం ముగుస్తుంది.
* 15వ తేదీన స్వామి వారికి కళ్యాణోత్సవం, రధం పై మోహినీసేవ గజవాహన సేవ వుంటాయి.
*16 వ తేదీన సింహవానంతో రధం పై ప్రభోత్సవం జరుగుతుంది.
* 17వ తేదీన రధోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 -30 నిమిషాలకుఆ తర్వాత
దాదాపు లక్షమంది స్వామివారిని దర్శించుకుంటారు.
తెప్పోత్సవంను రాత్రి 8 -00 .....నుండి ఉ 10 -00 గంటల వరకు నిర్వహించారు.
* 19 వ తేదీన శేషవాహన సేవ, తీర్ధావళి తదనంతరం పానుపు సేవలు జరుగుతాయి.
* గర 3 సంవత్సరాల నుండి ఫొండర్ ట్రస్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి యాగాన్ని లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్నారు
3.4.9 సాహితీ సంపద :
స్వామిఅవతారం నృసింహు డైనప్పటెకీ కోరిన కోర్కెలను నెరవేర్చేదైవంగా ఈ స్వామి ఖ్యతినొందారు. ఈ ప్రాంత స్వామి పై అక్షరలక్షలు విలువ చేసే సాహితీ సృష్టి జరిగింది. సురభి వంశంలో 26 వ తరం రాజైన శ్రీవేంకట జగన్నాధరావు కాలంలో కవి సార్వభౌ బిరుదాంకితుటైన హోసదుర్గం కృష్ణమాచార్యూలు సింగపట్నం నృసింహస్వామికి అంకితంగా " లక్ష్మీ నృసింహవిలాసం" అను సంస్క్రత చంపవును రచించాడు.

"సింగపట్న నృసింహ శతకం" ను, సింగపట్టణ నరసింహ విలాసం"
"సింగపట్టణ నృసింహ క్షేత్ర మా హాత్మ్యం"ను రచించారు.సింగపట్టణ నృసింహశతకం మకుటం ' సింగవట నరసింహ ' సింగపట్టణం నివాసియైన శ్రీవత్సస గోత్రీకులైన ఓరుగంటి లక్ష్మీ నారాయణగారు " సింగపట్నం లక్ష్మీ నృసింహస్వామి చరితం" అను వచన కృతిని రచించారు .
ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ ' నవరత్నస్తోత్రమాల ' ను రచించారు.
3.4.10 ప్రత్యేకతలు - ముగింపు :
* ఈక్షేత్రంలో స్వామి నృసింహుడు అయినప్పటికీ లింగరూపంలో వుంటాడు. స్వామికి త్రిపుండ్రాలు, ఊర్ధ్వ పుండ్రాలు వుండటం వలన స్వామి హరిహరాద్వైతంనకు ప్రతిరూపంగా నిలుస్తాడు.
*స్వయం భూ : అయిన స్వామికి అర్చకులుగా స్మార్తులైన శ్రీవత్స గోత్రీకులు, ఓరుగంటి వంశీయులు ఇప్పటికి కొనసాగుతూనే వున్నారు.
* నృసింహస్వామికి అభిముఖంగా 1 కి.మీ. దూరంలో గిరిపై రత్న లక్ష్మీ అమ్మవారు వెలిశారు.
*సంకటాలు వున్న వారు ఈ ఆలయంలో గండదీపం మోసి తమ మ్రొక్కులను చెల్లించుకుంటారు. ఈ స్వామికి మ్రొక్కు క్రింది గు మ్మడికాయలు సమర్పించుకుంటారు. గొల్లదాసరులు ఈ స్వామి సేవలో తరిస్తారు.
* భక్తులు పవిత్ర గుండలో బెల్లం గడ్డలు వేసి తమ బరువులను తొలగించుకుంటారు.
*స్వామి ఆలయ పాదానికి ఎడమవైపున నృసింహసాగరం ప్రతీ 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూర్తిగా
నిండి అలుగు పారుతుంది.
* భక్తులకు స్వామి ఆవాహన అయ్యి భూత ,భవిష్యత్ కాలాలను గురించి చెప్తాడు.
*స్వయం భూ అయిన ఈ స్వామి ఏకాదికేడాది క్రమక్రమంగా పెరుగుతున్నాడని భక్తులూ విశ్వసిస్తున్నారు.

స్వామి ఆవిర్భవించిన సందర్భంలో...
స్వామి ----- నృసింహుడు, .........భూపాలుడు ---- సింగమనాయుడు
గ్రామం ---- సింగపట్టణం ......తొలి అర్చకుడు ---- నరసింహయ్య శాస్త్రి
కాకతాళీయంగా ఒకటే కావడం వెశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నొ వింతలకు, వెశేషాలకు, విశ్వాసాలకు నిలయం ఈసింగపట్టణం . శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతర ఈ ప్రాంత జనుల సంస్క్రతికి దర్పణం పడుతుంది. కుల, మత వర్గాలకు అతీతంగా జానపదులను ఒకేత్రాటి పై నడుపుతోంది. వర్తమాన పరిస్థితుల ప్రభావాన్ని తన దరికి చేరనివ్వకుండా భక్తుల పాలిట కోరిన కోర్కెల కొంగు బంగారమై ఆదర్శంగా నిలుస్తోంది.
[ఆధారం :"కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు ఒక పరిశీలన "తూర్పింటి నరేశ్ కుమార్ ]
naresh.tuurpinti@gmail.com......9000964558

Thursday, February 4, 2010

The History of Singotam:సింగోటం [సింగపట్నం ] చరిత్ర :




సింగోటం [సింగపట్నం ] చరిత్ర :
"ఏ దేశ మేగినా ఎందు కాలిడిన ...
ఏ పీఠ మెక్కినా ఎవ్వరెదురైన
పొగడరా..నీ తల్లి భూమి భారతిని...
నిలుపరా నీ జాతి నిండు గౌరవం".....
అని ఓ కవి గారు చెప్పినట్లుగా ..
.నేను మాఊరి చరిత్ర గురించి...
ఇక్కడ పేర్కొనడం.నిజంగా..నా పూర్వ జన్మ సుకృతం ంగా భావిస్తున్నాను.
పూర్వం ఈ ప్రాంతాన్ని జటప్రోలు కేంద్రంగా 'సింగమ భూపాలుడు ' అనే రాజు పాలించేవాడు. అతని పేరు మీదుగా
['సింగోటం / సింగపట్నం' ]వచ్చిందంటారు. అదే విధంగా ఈ ప్రాంత దైవం " నరసింహ స్వామి " సింహ పదానికి వికృతి ..'సింగమ' సింగమ పేరు ....'సింగవట్నం ' గా మారిందని చెప్తారు.
కాని చదువురాని నిరక్ష్య రాస్యులు అలా పలకడం రానందున
సింగోటం అని ...పిలిచి...పిలిచి ....చివరకు సింగోటం గా స్థిరపడింది.
{ఆధారం : "కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన "...తూర్పింటి నరేశ్ కుమార్ }
మీ ప్రాంతాభిమాని ...
సదా మీ నుంచి పోస్టింగులు ఆశించే ....
.మీ..... తూర్పింటి నరేశ్ కుమార్