Monday, February 7, 2011

Dragging of Rock Competation in SINGOTAM:సింగోటంలో బండలాగుడు పోటీలు


సింగోటంలో బండలాగుడు పోటీలు ప్రతీ సంవత్సరం సంక్రాంతి తర్వాత జరుగుతాయి.వేలాది ప్రజల ఆనందోత్సహాల మధ్య ఈ ఏడాది పోటీలు జరిగాయి. తూర్పింటి

సింగోటంలో బండలాగుడు పోటీలు
సింగోటం గ్రామంలో ప్రతీ సంవత్సరంలాగానే ఏడాది కూడా బండలాగుడు పోటీలు
లక్శ్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల తదనంతరం జరిగాయి. ఊళ్ళోని సంతబజారుకు
అభిముఖంగా ఉన్న పొలాళ్లో "ఈ పోటీలుచూపరులకు నయనానందంతో పాటు దుస్తులకు
కాసింత దుమ్మును "ఉచితంగా అందించాయి.
పోటీల్లో రెండు ఎద్దుల జంట విభాగంలో మొదటి బహుమతిని ...
1517 అడుగుల 10 ఇంచుల దూరం లాగిన వనపర్తి ,జంగిడి రాజు ఎద్దుల జంట కైవసం చేసుకున్నాయి.
వీరికి ఒక తులం బంగారం ను సింగోటం గ్రామ సర్పంచ్ ఎల్లపోగుల వెంకటస్వామి
చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.
ఇహ రెండవ బహుమతిని 1232అడుగుల 10 ఇంచులు లాగిన దావాజిపల్లి ,ప్రవీణ్ రెడ్డి
ఎద్దుల జంట కైవసం చేసుకున్నాయి.వీరికి అర తులం బంగారం ను కార్యక్రమం
తదనంతరం గ్రామ సచివాలయం లో ఇవ్వడం జరిగింది.
3
బహుమతిని సింగిల్ విభాగంలో (వ్యక్తిగత విభాగంలో)బి.బాలయ్య , కోడేర్ ఎద్దు 80 అడుగుల 10 ఇంచులు లాగి
10
తులాల వెండిని గెలుపొందింది.
కార్యక్రమంలో ............................
ఎం.పి.పి శ్రీ జి.నరేందర్ రెడ్డి ,
గ్రామసర్పంచ్ శ్రీ .వెంకటస్వామి,ఉప సర్పంచ్ శ్రీ సిలోన్ ,శ్రీ బుచ్చిబాబు ,ఎం.పి.టి.సి శ్రీ పాండు, గ్రామ కాంగ్రేస్ యువ నాయకులు శ్రీ కె.వీరయ్యశెట్టి , గ్రామ నాయకులుశ్రీ గణాచారి,
వార్డ్ మెంబర్ శ్రీ జి.నరసింహా,శ్రీ పి.వెంకటస్వామి,గ్రామ యువకులు ,వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన ప్రజలతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.
సేకరణ
: తూర్పింటి నరేశ్ కుమార్

No comments:

Post a Comment